KMM: మధిర మండలం తొండలగోపవరలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంగా శనివారం జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ షేక్ కన్నా సాహెబ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.