VSP: విశాఖలో భూముల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మద్దిలపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ప్రజల అసైన్డ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.