BPT: ‘స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం కొట్రావారి బజారులో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రహదారుల శుభ్రత, డ్రైనేజీ పూడికల తొలగింపు, పిచ్చి మొక్కల నిర్మూలన వంటి పనులు చేపట్టారు. బాపట్ల ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.