TG: ‘ఉపాధి హామీ పథకం’ పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ప్యారడెజ్ ఎంజీరోడ్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి వివేక్, వీహెచ్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.