సత్యసాయి: బుక్కపట్నం డైట్ కళాశాలలో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలే దేశ భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 250కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విజేతలను కలెక్టర్, విద్యాశాఖ అధికారులు అభినందించారు.