సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై US అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘అక్కడి ఐసిస్ స్థావరాలపై భీకర దాడులు చేశాం. దాన్ని పూర్తిగా నిర్మూలిస్తే సిరియాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ చర్య గురించి అక్కడి ప్రభుత్వానికి తెలుసు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు వారు మద్దతు ఇచ్చారు’ అని పేర్కొన్నారు.