SRCL: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లాలోని రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇంఛార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. జిల్లాలోని ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ ఇతర పోటీలు చేపడుతామని పేర్కొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని వివరించారు.