GNTR: తెనాలి వన్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. సీఐ మల్లికార్జునరావు పర్యవేక్షణలో బోసురోడ్డులోని కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ జనార్ధనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.