MDCL: పాఠశాల స్థాయిలోనే పిల్లలకు స్కిల్స్ నేర్పించాలని ఉప్పల్ MEO రామారావు అన్నారు. ఉప్పల్ పరిధి పద్మావతి కాలనీ కాకతీయ టెక్నో స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో MEO, ప్రిన్సిపల్ రాజుతో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వంటలు రుచి చూసి, అద్భుతంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల మక్కువను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.