ATP: ఎల్లనూరు మండల కేంద్రంలో రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రతిరోజు చిత్రావతి నది నుంచి టిప్పర్ల ద్వారా పరిమితికి మించి ఇసుకను తరలిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయని మండల ప్రజలు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.