బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోంది. తాజాగా భారత్లో ఈ సినిమా ‘అవతార్ 3’ని బీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విడుదలైన ‘అవతార్ 3’ ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి రూ.20 కోట్లు వసూళ్లు సాధించగా.. ఈ మూవీ 15వ రోజు కూడా రూ.22.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు సృష్టించనుంది.