AP: రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడమే జగన్ పని అని మంత్రి సవిత ఆరోపించారు. జగన్ ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మద్దతిస్తారని.. గల్లీలో మాత్రం డ్రామాలు చేస్తారని మండిపడ్డారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇప్పుడు సంతకాల డ్రామా అంటూ విమర్శించారు. వైద్య కళాశాలలకు జగన్ ఏం ఖర్చు చేయలేదన్నారు.