SKLM గ్రామాలలో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఇవాళ సాయంత్రం ఆమదాలవలస మండలంలో తోటాడ, అక్కివరం పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు–కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే ప్రజలకు నిత్యజీవితంలో అనేక ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు.