KMR: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సంచార జాతుల వారికి రగ్గులు పంపిణీ చేశారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను గుర్తించి ఈ సాయం అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.