KMR: వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం రైతులకు ఎంతో లాభదాయకమని ఏఈవో భూపాల్ సంతోష్ అన్నారు. మల్కాపూర్ శివారులో పంట పొలాలను ఆయన సందర్శించారు. రైతులకు సాగు మెళకువలను వివరిస్తూ.. ఈ పద్ధతి ద్వారా నారు పెంపకం, నాట్లు వేసే ఖర్చు తప్పుతుందన్నారు. పంట కూడా సాధారణం కంటే ముందుగానే కోతకు వస్తుందని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చని సూచించారు.