SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్,తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.