ప్రకాశం: కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు సాగుతోందని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. ఇవాళ పట్టణంలోని 5వ వార్డులో రూ. 29.50 లక్షల నిధులతో చేపడుతున్న నూతన డ్రైనేజ్ నిర్మాణ పనులను ఛైర్మన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజ్ పనులను నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.