వీసా కష్టాల నేపథ్యంలో గూగుల్ తన ఉద్యోగులను హెచ్చరించింది. “అమెరికా దాటి బయటకు వెళ్లకండి” అని స్పష్టం చేసింది. కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్ల వీసా అపాయింట్మెంట్లు 2026 వరకు దొరకడం లేదు. ఇప్పుడు దేశం దాటితే.. స్టాంపింగ్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, అందుకే H1B, H4 వీసాదారులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మెయిల్స్ పంపింది.