CTR: పూతలపట్టు మండల పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పూతలపట్టు పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా CI గోపి వీధుల్లో చెత్త తొలగించి, స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలను స్వచ్ఛంగా ఉంచినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలన్నారు.