అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇవాళ పాడేరు తలారిసింగిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా, ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.