MBNR: తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ డిమాండ్ చేశారు. భూత్పూర్ మండలం వేముల గ్రామంలో జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శనివారం నిరసన చేపట్టారు. దళిత అమ్మాయిపై ఇటువంటి ఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని వెల్లడించారు.