సంపూర్ణ ఆరోగ్యవంతుడు కోటీశ్వరుడితో సమానం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కాకుండా పరిశుభ్రత కూడా అవసరం. మన ఇల్లు, స్కూలు, ఆఫీసు, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఇందుకు ఏపీలోని ఓ కలెక్టర్ ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం ఇప్పుడు అన్ని పాఠశాలల్లో ప్రారంభమైంది. మనం కూడా ఇదే స్ఫూర్తిని ప్రతీ ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం తేడా లేకుండా కొనసాగిద్దాం. ఏమంటారు?