GNTR: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఈ కటౌట్లలో ఏపీ నేతలతో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటిందంటూ నెటిజన్లు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.