CTR: సీఎం సహాయనిధి రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 19 మందికి రూ.16,87,690 విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.