ASR: ఎంపీపీ పదవి కోల్పోయినా ప్రజాసేవలో కొనసాగుతానని అనంతగిరి మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి స్పష్టం చేశారు. ఎంపీటీసీగా ప్రజలకు అందించిన అవకాశాలకు మండల ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రాజకీయ కుయుక్తుల వల్ల ఓటమి ఎదురైనా ప్రజల ఆదరాభిమానాలే తన బలమని అన్నారు.