సూర్యాపేట: తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అడివేముల గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన కలకోట్ల శైలేందర్ సర్పంచిగా గెలుపొందారు. శైలేందర్ మాట్లాడుతూ.. తాను సర్పంచ్ గా అయినా కూడా తన వృత్తి ధర్మాన్ని మరవకుండా ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తానని తెలిపారు.అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.