ASR: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకుని వచ్చిందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్, అరకు మండల ఉపాధ్యక్షుడు జగన్నాథం ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అయితే ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. శనివారం అరకు మండలం శరభగూడలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.