SRCL: ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వేములవాడ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈనెల 21వ తేదీన ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దాజీతో ఆన్లైన్లో ధ్యానం చేయండి’ కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.