NZB: పల్లెల్లో సహకార సంఘ ఛైర్మన్ ఎన్నికలకు సర్కారు సిద్ధం అవుతోంది. రెండేళ్ల క్రితం పాలకవర్గాలు రద్దు అయినా సర్కారు ప్రతి ఆరు నెలలకు పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులతో పాలక వర్గం గడువు ముగిసింది. అదే సమయంలో జిల్లా డీసీసీబీ ఛైర్మన్, డైరెక్టర్ పదవీకాలం ముగిసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ నం.597ను జారీ చేసింది.