AKP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో శనివారం ‘ముస్తాబు’కార్యక్రమాన్ని హెచ్ఎం వైవీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలో అద్దం, దువ్విన, పౌడర్, నైల్ కట్టర్, సబ్బులు, టవల్స్, తదితర పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచమన్నారు.