AP: రంగుల పిచ్చితో ‘నాడు-నేడు’ అంటూ వైసీపీ హయాంలో జగన్ విద్యావ్యవస్థను దోపిడీ చేశారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ‘ముస్తాబు’ కార్యక్రమం రాష్ట్రమంతటా ఆచరణలోకి రావడం శుభపరిణామమని అన్నారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉన్నతంగా తీర్చిదిద్ధడమే లక్ష్యమన్నారు. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పర్యవేక్షణ ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.