గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఢిల్లీలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అక్కడి వెళ్లినట్లు.. ఆ షెడ్యూల్తో మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.