SRCL: చందుర్తి (M) మల్యాల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం కుంకుమ పూజలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో సుప్రభాత సేవ కాలంలో ఆలయ అర్చకులు కందాల వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై భక్తిశ్రద్ధలతో ఐదో పాశురం ప్రబంధకాన్ని పఠిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.