WGL: పట్టణ కేంద్రంలోని శ్రీ చక్ర హాస్పిటల్లో మోకాలపల్లి గ్రామానికి చెందిన కుంజా శ్రీను, గార్డియన్ హాస్పిటల్లో తుడం దెబ్బ నాయకుడు వట్టం ఉపేందర్ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క ఇవాళ ఉదయం ఆస్పత్రులకు వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.