యాషెస్ 3వ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. పాక్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో 150+ వికెట్లు పడగొట్టిన రెండో కెప్టెన్గా నిలిచాడు. కమిన్స్ ఇప్పటివరకు 151* వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ 187 వికెట్లు తీశాడు. కాగా భారత్ తరఫున కపిల్ దేవ్(111), బిషన్ బేడీ(106) మాత్రమే కెప్టెన్గా 100+ వికెట్లు పడగొట్టారు.