AKP: ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి కార్మికులు ప్రజా సంఘాలు ముందుకు రావాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె. అప్పారావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. సోమునాయుడు పిలుపునిచ్చారు. అచ్యుతాపురం తిమ్మరాజుపేటలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ పథకాన్ని ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పథకంగా మార్చి వేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతుందన్నారు.