AKP: కసింకోట మండలం తాళ్లపాలెంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా ఇంఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం సందర్శించారు. సీఎం చంద్రబాబు పాఠశాలలో విద్యార్థులతో ఉదయం 11:30కు ముచ్చటించనున్న నేపథ్యంలో మంత్రి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున చదువుపై దృష్టి పెట్టాలన్నారు.