బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నితిన్‌ను మోదీ సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు. నితిన్ నబిన్‌కు ఉన్న పరిపాలనా అనుభవం బీజేపీకి ఒక ఆస్తి అని ప్రధాని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.