W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా పూర్తి స్థాయిలో కల్పిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం కాస్పా పెంటపాడు గ్రామంలో. రక్షిత మంచి నీటి పథకాన్ని ఆయన శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.