ప్రకాశం: దోర్నాల పట్టణంలోని ఏబీఎం పాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రూ. 20 లక్షల వ్యాయామంతో 18 కాలువ కల్వర్టుల పనులకు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.