తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు గురుమూర్తికి మరదలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ ఎఫైర్ కారణంగానే తరచూ గురుమూర్తి, మాధవి మధ్య గొడవలు జరిగేవని తెలిసింది. ఇదే విషయంపై పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి తీరు మారలేదు. మళ్లీ అదే విషయంపై గొడవ పడటంతో మాధవిని హత్య చేసినట్లు సమాచారం.