VZM: అన్న క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించాలని నెల్లిమర్ల మునిసిపల్ కమీషనర్ జనార్దనరావు సూచించారు. ఇవాళ నగర పంచాయతి పరిధిలోని అన్న క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నాణ్యత, పరిశుభ్రతలపై దృష్టి సారించాలని నిర్వాహకుడు వీ. అప్పారావును ఆదేశించారు. అల్పాహారం ఎలా ఉందని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.