MNCL: ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల DAO సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. యాప్ ద్వారా నిజమైన సాగుదారులకు జిల్లాలో యూరియా నిల్వల సమాచారం తెలుస్తుందని, ఎరువుల దుకాణాల వద్ద రద్దీ లేకుండా ఇంటి వద్దనే తమ మొబైల్ యాప్ వినియోగించి ఎరువులను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి యాప్ ద్వారా మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలని అన్నారు.