NLG: కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం తేదీలో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. ముందు నిర్ణయించిన ఈ నెల 20కి బదులు 22న కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేయాలని ఉత్తర్వులను విలువరించింది. ఆరోజున ముహూర్తం బాగాలేదని నూతనంగా ఎన్నికైన సర్పంచుల నుంచి వినతులు రావడంతో పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు.