కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, పల్వంచ మండలాల ప్రజలకు అత్యవసర ప్రజా హెచ్చరికను అటవీశాఖ అధికారులు జారీ చేశారు. మాచారెడ్డి అటవీక్షేత్ర పరిధిలో పెద్దపులి సంచరిస్తున్న విషయం నిర్ధారణ అయిన నేపథ్యంలో గ్రామస్తులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు అటవీ క్షేత్రాలకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ చేశారు.