KNR: ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళితే గ్రామాల అభివృద్ధి సత్వరం సాధ్యపడుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పలు మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు బుధవారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినప్పుడు వారిని శాలువాలతో సత్కరించారు.