NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన మహపడి పూజా కార్యక్రమంలో బుధవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణ రావు, అయ్యప్ప స్వాములు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.