ప్రకాశం: మార్కాపురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగరాజు ఇవాళ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలు నాశనం అవ్వడమే కాక కుటుంబమంతా వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇకనైనా సత్ప్రవర్తనతో సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని డీఎస్పీ సూచించారు.