TG: రాష్ట్రంలో మూడు విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇప్పటివరకు 4145 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2246 స్థానాల్లో గెలుపొందారు. 1162 స్థానాల్లో BRS సానుభూతిపరులు విజయం సాధించారు. BJP తరఫున పోటీ చేసిన వారిలో 246 స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు 491 సర్పంచ్ స్థానాలను సొంతం చేసుకున్నారు.