PPM: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్ది కురుపాం మండలం నీలకంఠాపురంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాత్రి నిద్ర చేశారు. మంగళవారం రాత్రి దాదాపు 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రశ్నలను అడిగారు.